ఆ రోజు ఏం జరిగిందంటేaa-roju-em-jarigindante

telugu sex stories boothu kathalu నీ వల్ల కాదు…” ఆవేశంగా అన్నాడు మోహన్.

అతని మాటలకి పెద్దగా నవ్వింది వాణి…” ఈ వాణి తలుచుకుంటే ఏమైనా చేస్తుంది. ఈ విషయంలో కూడా అంతే… నేను మనసు పెట్టి రంగంలోకి దీగాలే కానీ… ఇక ఆ పని జరగకపోవడమంటూ ఉండదు …” స్ధిరంగా అంది వాణి.

”అయితే చూద్దాం… నీకు నేను వారం రోజులు గడువిస్తున్నాను… నువ్వేం చేసినా ఈ వారంలోపే చేయాలి… అలా చేయగలిగితే నేను ఓడిపోయానని ఒప్పుకుంటాను…” అన్నాడు మోహన్…

మళ్ళీ నవ్వింది వాణి…”అయితే ఓడిపోవడానికి సిద్ధంగా ఉండు” అంది…

”అబ్బా అచ్చు కుందనపు బొమ్మలా ఉన్నావు తెలుసా…?” సుప్రియని చూస్తూ మెచ్చుకోలుగా అంది వాణి.

ఆమె మాటలకి సుప్రియ సిగ్గుతో ముడుచుకు పోయింది…

”అబ్బో సిగ్గే…! అయినా ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి. నువ్వు నా కంటే అందంగా వున్నావు తెలుసా?” అంది ఆమెని మరింత పొగుడుతూ…

ఈసారి వాణి వైపు సీరియస్ గా చూసింది సుప్రియ ”అవును… నీ కంటే కాదు… ఈ లోకంలో ఉన్న ఆడాళ్ళందరి కంటే నేనే అందంగా ఉంటాను…”

”వింటున్నాను కదా అని మరీ ఇలా విడ్డూరంగా మాట్లాడటం ఏమీ బావో లేదు…” అంది సుప్రియ.

వాణి చిన్నగా నవ్వుకుంది సుప్రియని చూసి, ”అవునులే, ఆడదాని అండం గురించి మరో ఆడది పొగిడితే విడ్డూరంగానే అనిపిస్తుంది… అదే ఏ మగాడో ఎదురుగా వచ్చి భావావేశంతో నీ అందాన్ని వర్ణిస్తుంటే తెగ సంబరపడిపోతావు” ఆమెని ఉడికిస్తున్నట్టుగా అంది వాణి.

”నా ఎదురుగా మరో మగాడు వచ్చి నా అందాన్ని పొగడమా? అలా గాని జరిగితే వాణ్ని చెప్పుతో కొడతాను” కోపంగా అంది సుప్రియ.

”అయ్యో పాపం… నీ అందాన్ని పొగడం కూడా వాళ్ళు చేసిన తప్పేనా? అంది వాణి…

”తప్పా… తప్పున్నరా… అయినా ఒక పెళ్ళయిన ఆడదాని ముందుకి ఎవడైనా వచ్చి నువ్వు చాలా అందంగా ఉన్నావని పొగిడేస్తే వాడి మాటలకి పొంగిపోతాననుకుంటున్నావా? నాలుగు తగిలించి పోలీస్ స్టేషన్ కి లాక్కెళతాను” కోపంగా అంది సుప్రియ.

ఆమె అలా ఆవేశపడుతుంటే వాణి లోలోపలే నవ్వుకుంటుంది…. సుప్రియ మనసు సున్నితమైనది… ప్రతి విషయాన్నీ భూతద్దంలోంచి చూస్తుంది… చిన్న ఇన్సిడెంట్ జరిగినా ఎంతో ఫీలయిపోతుంది… సుప్రియ ఆమెని సరదాగా ఆట పట్టించడం వానికి అలవాటై పోయింది… అందుకే ఆమెకి కోపం తెప్పించే మాటలతో సుప్రియ మరింత ఉడుక్కునేలా చేస్తుంది వాణి. ”అవునులే, పెళ్లైన ఆడవాళ్ళని కామెంట్ చేస్తే నువ్వే కాదు, ఏ ఆడదైన చెప్పుతోనే సమాధానం చెబుతుంది…” అంది వాణి.

”మరి అన్నీ తెలిసి ఎందుకలా అనవసరంగా ఈ విషయాన్ని లేవనెత్తావు?” అంది సుప్రియ విసుగ్గా…

తడబడింది వాణి. ఆ వెంటనే సర్దుకుని ”నేనంటున్నది ఆర్నెల్ల క్రితం సంగతి” అంది వాణి.

ఆమె మాటలు అర్ధం కాలేదు సుప్రియకి ”ఆర్నెల్ల క్రితమా?” అంది ఆశ్చర్యంగా.

”అవును,,, నీకు పెళ్లి ఆరు నెలలే అవుతుంది కదా… అంతకు ముందుగా ఎవరైనా నీ అందాన్ని పోగిడారేమో!” అని అంటున్నాను అంది వాణి కొంటెగా.

సుప్రియ వాణిని చూసింది. ఎందుకో వాణిపై ఒకవిధమైన అనుమానం కలిగింది సుప్రియకి… ఆమె అలా ఎందుకడుగుతుందో… కారణం ఏమిటో లీలగా అర్ధమయింది సుప్రియకి. పెళ్ళికి ముందు తన జీవితం గురించి ఆరా తీస్తుందంటే దానికి ఏదో కారణం ఉంది ఉంటుంది అనుకుంది సుప్రియ. వాణి సుప్రియ భర్తకి స్వయానా మరదలు… అతని మేనత్త కూతురు… అన్నింటి కన్నా మరో ముఖ్య విషయం ఏమిటంటే తను పెళ్ళి చేసుకోకపోయుంటే ఆయనని వాణియే పెళ్ళి చేసుకునేదేమో… కారణాలు ఏమైనా వాణి స్థానంలో ఇప్పుడు తను ఉన్నది బావతో పెళ్ళి జరగలేదంన్ బాధతో తనపై ద్వేషాన్ని పెంచుకున్నదేమో,

తన గురించి ఆరా తీసి, ఏమైనా తన ప్రవర్తనలో అనుమానం కలిగించే అంశాలు వెతికి, వాటిని భూతద్దంలో తన బావకి చూపించి, అన్యోన్యంగా ఉంటున్న మా ఆలూ… మగల మధ్య చిచ్చురగిలించడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తుందేమో…” ఆ ఆలోచన రాగానే సుప్రియ వెన్నులోంచి సన్నగా వణుకు ప్రారంభమైంది. ఎందుకైనా మంచిది… వాణితో కాస్త జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకుంది సుప్రియ…

”హలో సుప్రియా… ఏమిటీ ఒకేసారి అలా ఊహాలోకాల్లోకి వెళ్ళిపోయావు…” అని ఆమె భుజంపైన మెల్లిగా తడుతూ,

”ఏమిటీ పెళ్ళికి ముందు జరిగిన స్వీట్ మెమోరీస్ ని గుర్తుకి తెచ్చుకుంటున్నావా…?” అంది సుప్రియనే చూస్తూ అల్లరిగా.

ఉలిక్కిపడింది సుప్రియ. తనూహించింది కరెక్టే. వాణి ఖచ్చితంగా తామిద్దరి మధ్య చిచ్చు రగల్కడానికి పూనుకుందని నిర్ధారణ అయిపొయింది. ఆ వెంటనే వాణిపైన విపరీతమైన కోపం ముంచుకు వచ్చింది సుప్రియకి. తనని తాను ఎలాగోలా సముదాయించు కుంది…. మొహంలోని ఫీలింగ్స్ ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ లేని నవ్వుని తెచ్చుకుంది సుప్రియ.

ఆ తర్వాత వాణి మాట్లాడిన మాటలని తేలికగా తీసుకున్నట్టుగా అంది…”నా జీవితంలో ఓకే ఒక వ్యక్తితొ నేను చనువుగా తిరిగాను. తిరుగుతాను కూడా…” అంది.

”ఎవరతను….?” ఆతృతగా అడిగింది వాణి.

”ఇంకెవరు… నా భర్తే…!” అంది సుప్రియ నవ్వుతూ….

ఆమె మాటలకి వాణి భారంగా నిట్టూర్పు విడిచింది…”నేను ఇంకెవరో అనుకున్నాను…” అంది.

”అవునూ… నా పర్సనల్ లైఫ్ గురించి ఎందుకంత ఇంట్రస్ట్ చూపిస్తున్నావు?” సూటిగా వాణినే చూస్తూ గంభీరంగా అంది సుప్రియ.

”అబ్బే… ఊరికే తెలుసుకుందామని… అయినా మనిద్దరం ఇంత కలివిడిగా ఉంటున్నప్పుడు… ఇలాంటి పర్సనల్ విషయాల్ని ఒకరికి ఒకరం తెలుసుకోవడంలో తప్పేముందు…?” అంది వాణి నవ్వుతూ.

”అయితే నీ గురించి చెప్పు… నువ్వింత వరకూ పెళ్ళెందుకు చేసుకోలేదు…” ఆతృతగా అడిగింది సుప్రియ.

ఆ మాటలకి సుప్రియ వంక ఓసారి చూసి చిన్నగా నవ్వింది వాణి… ఆమె ఏం సమాధానం చెబుతుందా అని ఊపిరి బిగపట్టి వాణి వంక చూస్తోంది సుప్రియ…. వాణి మరోసారి సుప్రియ వంక చూసి మెల్లిగా గొంతు విప్పింది. ”నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను… ప్రస్తుతం అతను ఎం.బి.ఏ చేస్తున్నాడు. అది పూర్తికాగానే పెద్దవాళ్ళని ఒప్పించి పెళ్ళి చేసుకోవాలను కుంటున్నాము, ఈ విషయంలో నువ్వు కూడా నాకు హెల్ప్ చేయాలి” ఆ మాటలు విని సుప్రియ తేలికగా నిట్టూర్పు విడిచింది.

వాణి మొహంలోని సిగ్గుని గమనించగానే ఆమె చెబుతున్నది నిజమేనని నమ్మకం కలిగింది సుప్రియకి… అయినా ఏదో అనుమానం ఇంకా తొలుస్తుంటుంటే…. ”మరి మీ బావని పెళ్ళి చేసుకోవాలని నువ్వు ఎప్పుడూ అనుకోలేదా…?”

సుప్రియ మాటలకి బిత్తరపోయింది వాణి. ”ఛ… ఛ… మా బావపైన నాకు ఎప్పుడూ అలాంటి ఫీలింగ్స్ కలగలేదు. మేమిద్దరం ఎప్పుడూ మంచి ప్రెండ్స్ లానే ఉన్నాము కానీ, పెళ్ళి చేసుకోవాలనే ఆలోచన మాకెప్పుడూ కలగలేదు… అయినా రోజుకి ఇరవై సార్లు తగవులాడుకునే మేము పెళ్ళి చేసుకుంటే ఇక ఇల్లు కిష్కింధ కాండే అవుతుంది… ఏదో నీ లాంటి అమాయకురాలు భార్యగా దొరికింది కాబట్టి ఈ మాత్రమైన కాపురం చేస్తున్నాడు” అంది నవ్వుతూ వాణి.

వాణి సమాధానంగా సంతృప్తి కలిగించినా తనని అమాయకురాలు అని అనడంతో సుప్రియకి రోషం ముంచుకు వచ్చింది. ”నువ్వనుకున్నంత అమాయకురాలిని ఏమీ కాను నేను. మా పెళ్ళికి ముందే మీ బావని నా చుట్టూ తిప్పుకున్నాను తెలుసా? నేను నిన్ను ప్రేమిస్తున్నానంటూ నేనెక్కడికి వెళితే అక్కడకు వచ్చేవాడు. నాకు ఆయన నచ్చడంతో నాకు మంచి పరిచయం ఉన్న ఒక అంకుల్ కి విషయం చెప్పి ఆయన మధ్యవర్తి ద్వారా పెద్దలు కుదిర్చిన వివాహం లాగానే పెళ్ళి చేసుకున్నాం… మా ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం సంగతి ఆ అంకుల్ తర్వాత తెలిసిన రెండో వ్యక్తివి నువ్వే…!” గర్వంగా అంది సుప్రియ.

ఆ మాటలు విన్న వాణి ఎంతో ఆశ్చర్యపోయింది….”ఏమిటీ … మా బావ ప్రేమ… ప్రేమ… అంటూ నీ వెనకాల కూడా పడ్డాడా…?” అప్రయత్నంగా అంది వాణి.

ఉలిక్కిపడింది సుప్రియ…”అంటే… ప్రేమిస్తున్నానంటూ తన భర్త మరొక అమ్మాయి వెంట కూడా పడ్డాడా…?” ఎందుకో ఆమె మనసు కీడు శంకిస్తోంది. అదురుతున్న గుండెలతో వాణి ముందు ఉంచింది తన అనుమానాన్ని సుప్రియ మొహంలో కంగారు స్పష్టంగా కనిపిస్తోంది. తను చేసిన పోరాపాతుని గ్రహించి నాలుక కర్చుకుంది వాణి….

వాతావరణాన్ని తేలిక పర్చడానికన్నట్టుగా…”అబ్బే… అలాంటిదేమీ లేదు. ఏదో సరదాగా అలా అన్నానంతే..!” అంది వాణి. ఆమె మాటలు కాస్త తడబడ్డాయి. ఆమె తడబాటుని గ్రహించిన సుప్రియకి వాణి తన దగ్గర ఏదో దాస్తుందన్న విషయం స్పష్టంగా అర్ధమయింది. మొట్టమొదటి సారి తన భర్తపై అనుమానం కలిగింది సుప్రియకి.

”చెప్పు…. ఆయన ఇంకా ఎవర్నైనా ప్రేమించాడా?” ఆదుర్దాగా అంది సుప్రియ.

వాణి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది. దాంతో సుప్రియ అనుమానం మరింత బలపడసాగింది.

”నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. చెప్పు వాణీ ప్లీజ్… ఇందాకే నువ్వన్నావు కదా మనిద్దరం మంచి ప్రెండ్స్ అనీ, ఇద్దరి మధ్య ఏ దాపరికాలు ఉండకూడదని… నువ్విప్పుడీ విషయాన్ని చెప్పకపోతే దీని గురించే ఆలోచిస్తూ నేనెంతో ఆవేదనకి గురౌతాను. ప్లీజ్ వాణీ చెప్పు… లేదంటే నా మీద ఒట్టే…” వాణి కుడిచేయిని తన తలపై పెట్టుకుని అంది సుప్రియ. సుప్రియ మొహంలోని ఆందోళనని చూసి భారంగా నిట్టూర్చింది వాణి. ఇక చెప్పక తప్పదన్నట్లు మెల్లిగా గొంతు విప్పింది…

” సరిగ్గా సంవత్సరం క్రితం ఒక రోజు …అంటూ ఆగింది వాణి.

”ఆ… ఒక రోజు… ఆ రోజు ఏం జరిగింది?” విస్మయంగా అంది సుప్రియ.

ఒకసారి సుప్రియ వంక చూసి మెల్లిగా గతంలోకి వెళ్ళిపోయింది వాణి…

”ఆరోజు ఏం జరిగిందంటే…?!”

*****

భయం భయంగా ఆ గదిలోకి అడుగు పెట్టింది శైలజ. సోఫాలో నుంచి లేచి ఆనందంగా ఆమె దగ్గరకు వచ్చాడు అతడు… ఆమె రెండు భుజాలని పట్టుకుని ”నాకు తెలుసు… నువ్వొస్తావని…” నవ్వుతూ అన్నాడు.

”నాకేదో భయంగా ఉంది. నేవెళ్ళిపోతాను” అంది బెదిరిపోతూ శైలజ.

”అబ్బా… నువ్వలా భయపదిపోతే ఉన్న మూడ్ కాస్తా పోతుంది. మాటలతొ ఇలా కాలక్షేపం చేస్తూ కూర్చుంటే… కొంప దీసి ఈ లాడ్జిలో రైడింగ్ గానీ జరిగితే పోలీసులకు పట్టుబడిపోతాం…”

ఆమె మరింత బెదిరి పోయింది ఆ మాటలకి…”అది కాదు నేను నీకో ముఖ్యమైన విషయం చెప్పాలి.”

”అబ్బా… ఇప్పుడు నేనేమీ వినే స్థితిలో లేను నన్నర్ధం చేసుకో…” అంటూనే వెళ్ళి తలుపులు మూసి గడి పెట్టి ఆమె దగ్గరకు వచ్చాడతడు.

ఆమెను మైకంగా చూస్తూ ”అనవసరమైన ఆలోచనలు చేసి బుర్ర పాడు చేసుకోకు… అంది వచ్చిన సుఖాన్ని ఆనందంగా అనుభవించు… మన పెళ్ళయ్యాక ఇవన్నీ స్వీట్ మెమొరీస్ గా గుర్తుండి పోతాయి” అని ఆమెని తన కౌగిలిలో బంధించాడు అతడు.

శైలజ మరేమీ మాట్లాడలేదు. అతని శరీర స్పర్శతో ఆమె ఒంట్లో మెల్లిగా వేడి పుట్టడం ప్రారంభమైంది. ఆమెలో కోరిక పుట్టడంతో అతని వీపు పైన తన రెండు చేతులు వేసి గట్టిగా హత్తుకుంది… తను కోరుకున్న ఎఫెక్ట్ ఆమెలో రావడంతో చిన్నగా నవ్వుకుని ఆమెని అమాంతం ఎత్తుకుని బెడ్ పైన పడుకోబెట్టాడు…

పైట తొలగి పోవడంతో ఆమె జాకెట్లో నుండి ఉబికి వస్తున్న అందాలని చూసి భరించలేక పోయాడు అతడు. తన ఒంటిపైన శర్తుని విప్పేసి ఆమె పైకి చేరిపోయాడు అతడు… ఆమె మొహాన్ని ముద్దులతో తడిపేస్తూ అలాగే క్రిందకు జారి ఆమె ఎద భాగంపైన తల ఆన్చి గట్టిగా హత్తుకున్నాడు… అతని చయలకి మైకంగా మూలుగుతూ కళ్ళు మూసుకుంది శైలజ. ఆమె శరీరాన్ని ముద్దులతో తడిపెస్తూనే ఆమె ఒంటిపైన ఉన్న వస్త్రాల్ని విప్పేయడం ప్రారంభించాడు అతడు…

క్షణాల్లో ఇద్దరూ పూర్తి నగ్నంగా మారిపోయారు. ఇద్దరిలోనూ కామోద్రేకం పెరిగిపోయింది, ఒఅకరిని మించి ఒకరు పోటీపడి రసక్రీడలో పాలు పంచుకుంటున్నారు. వెచ్చటి నిత్తోర్పులతో ఆ గడి నిన్దిపోతూంది. ఎ.సి. చల్లటిగాలి వదులుతున్నా ఇద్దరి శరీరాలూ చెమటతో తడిసిపోయాయి. అరగంట వరకూ వాళ్ళిద్దరూ ఈ లోకాన్ని మరిచి ఆనంద డోలిలికల్లో మునిగిపోయారు. పని పూర్తయిన తర్వాత శైలజ బెడ్ పై నుండి లేచి బట్టలు వేసుకుని బాత్ర్రూంలోకి వెళ్ళింది. అతడు ఆమె వచ్చేసరికి డ్రెస్ అప్ అయిపోయి బెడ్ పైన కూర్చున్నాడు.

ఆమె వచ్చి అతని ప్రక్కనే కూర్చుని మెల్లిగా అంది ”మనం వెంటనే పెళ్ళి చేసుకుందాం…”

ఆ మాటలకి చిన్నగా నవ్వాడతాడు. ”ఇప్పుడంత తొందరగా పెళ్ళి చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది…” అన్నాడు ఆమె భుజం చుట్టూ చేతులు వేస్తూ…

ఆమె అతని వైపు ఒకసారి చూసి తలదించుకుని చెప్పింది. ”ఎందుకంటే… నేనిప్పుడు గర్భవతిని కాబట్టి…!!”

ప్రక్కనే బాంబ్ పడ్డట్టు అదిరిపడ్డాడు అతడు ఆమె మాటలకి.

”సిగ్గు లేకుంటే సరి…చేసిందంతా చేసి ఇప్పుడిలా చేతులు నలుపుకుంటూ కూర్చుంటే ప్రయోజనం ఏముంది…!” కోపంగా అంది వాణి.

”అలా అనకే ఏదో ఒక ఉపాయం చెప్పి నన్నీ గండం నుంచి గట్టెక్కించవే” అభ్యర్ధనగా అన్నాడతను….

”దీనికి అంత ఆలోచించాల్సిన అవసరం ఏముంది. లక్షణంగా ఆమెని పెళ్ళి చేసుకుని హాయిగా కాపురం చేసుకో” తేలికగా అంది వాణి.

”నేను దాన్ని పెళ్ళి చేసుకోవడమా…? అది జరగని పని…! అయినా నా లెవలేంటి దాని లెవలేంటి…? వత్తి పల్లెటూరి మొద్దు… ఏదో అందంగా ఉంది కదాని కమితయ్యాను. కానీ పెళ్ళి చేసుకోవడానికి కాదు…”విసుగ్గా అన్నాడతడు…

వాణి అతని వైపు కోపంగా చూసింది. ”ఆడదాని జీవితాన్ని అంత చులకనగా తీసి పారేస్తావా.. ఇప్పుడా అమ్మాయి గర్భవతి. మరో ఆరేడు నెలలు ఆగితే మీ ఇద్దరి ప్రతిరూపంగా మరో ప్రాణం పోసుకుంటుంది. అప్పుడు నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీ కాళ్ళూ చేతులు కట్టేసి మరీ మీ ఇద్దరికీ పెళ్ళి జరిపిస్తారు…”

విస్మయంగా వాణి వైపు చూశాడతడు. ”సొంత మరదలివి… చిన్నప్పటి నుంచి ఫ్రెండువి కదాని నిన్ను సలహా అడిగితె భయపెట్టే మాటలతో నన్ను మరింత టెన్షన్ కి గురి చేస్తావా…? అయినా నిన్ను సలహా అడిగాను చూడు… అందుకు నన్ను నేనె చెప్పుతో కొట్టుకోవాలి…” అంటూ అక్కడి నుండి లేచి వెళ్ళిపోబోయాడు అతడు…

”మరిప్పుడేం చేయాలనుకుంటున్నావ్?” ఆతృతగా అడిగింది వాణి….

అతను వెనక్కి తిరిగి వాణి వంక చూశాడు…. అతని మొహం రౌద్రంతో నిండిపోయింది… అతన్ని అలా చూసిన వాణికి కూడా ఆ క్షణంలో భయమేసింది…”ఇప్పుడు నాకు ఒక్కటే దారి వుంది. దానికి ఎలాగైనా నచ్చజెప్పి అబార్షన్ చేయించుకోవడానికి ఒప్పిస్తాను… కాదు… కూడదని మొండికేస్తే దాన్ని ఈ లోకంలో నుండే…!!”

”ఆపు… ఇక ఏమీ చెప్పకు…!” గట్టిగా అరిచింది సుప్రియ. ఆమె మెదడంతా మొద్దుబారిపోయినట్లయింది… దుఃఖం ముంచుకు వస్తుండటంతో ఇక అక్కడ నిలబడలేక బెడ్ రూంలోకిపరుగు తీసింది సుప్రియ… ఆమె వెనకాలే కంగారుగా వాణి కూడా పరుగెత్తింది… బెడ్ పైన పడుకుని వెక్కి వెక్కి ఏడవటం ప్రారంభించింది సుప్రియ. ఆమెని ఓదార్చినా ప్రయోజనం శూన్యం అని గ్రహించింది వాణి.

”సారీ సుప్రియా… ఈ నిజాన్ని నీతో చెప్పి నిన్ను చాలా బాధపెట్టాను… నీ మీద ఒట్టు పెట్టుకునే సరికి ఇక చెప్పక తప్పింది కాదు… ఆయామ్ రియల్లీ సారీ…!”

మాటలు వినే పరిస్థితిలో లేకుండా ఏడుస్తోంది సుప్రియ… వాణి భారంగా నిట్టూర్చి అక్కడి నుండి వెళ్ళిపోయింది… సుప్రియ బెడ్ పైన పడుకుని అలా ఏడుస్తూనే ఉంది. సాయంత్రం వరకు బెడ్ పైన పడుకుని ఏడుస్తూ ఉండి పోయింది సుప్రియ…భుజం పైన చేయి పడగానే చివాలున తల త్రిప్పి చూసింది. ఎదురుగా తన భర్త… అతన్ని చూడగానే ఆమెకి అసహ్యంతో పాటు కోపం కూడా వచ్చింది. తన భుజంపైన ఉన్న అతని చేతిని విసురుగా నెట్టేసింది.

ఆ చర్యకి అవాక్కైపోయాడు అతడు… ఎన్నడూ లేని విధంగా భార్య ప్రవర్తన ఉండడంతో ఆశ్చర్యపోతూ…”ఏమిటి సుప్రియా.. అసలేం జరిగింది…” లాలనగా అంటూ ఆమె పక్కన కూర్చోబోయాడు అతడు…

అతనికి దూరంగా జరుగుతూ…”రావొద్దు… దగ్గరికి రావొద్దు… నిన్ను చూడాలంటే అసహ్యంగా ఉంది నాకు” ఏడుస్తూనే కోపంగా అరిచినట్టుగా అంది సుప్రియ.

షాకైపోయాడు అతడు… ఆమెకి అంత కోపం కలిగించే పనిని తనేం చేశాడో అర్ధం కాలేదు… ఉదయం ఆఫీసుకి బయలుదేరేటప్పుడు ఎంతో ప్రేమగా సాగనంపిన సుప్రియేనా ఇప్పుడిలా ప్రవర్తిస్తుంది అని ఆశ్చర్యపోయాడతను… ”అసలేం జరిగింది సుప్రియా…?” అన్నాడు సౌమ్యంగా.

”పెద్ద ఘోరమే జరిగిపోయింది… ఆడవాళ్ళ జీవితాలతో ఆటలాడుకునే నిన్ను పెళ్ళి చేసుకున్నాను చూడూ… అదే నా జీవితంలో పెద్ద ఘోరం జరిగింది… నిన్ను మంచి వాడిగా నమ్మి, నీవే నా ప్రాణంగా బ్రతుకుతున్న నేను, నీలోని మృగాన్ని చూసి, నేనెంత తప్పు చేసానా అని ఇప్పుడు బాధపడుతున్నాను…”

అతని మెదడు మొద్దుబారిపోయినట్టయింది ఆమె మాటలకి… ఇంత కోపంగా సుప్రియ ఉండటం అతనెప్పుడూ చూడలేదు… ఆమెని ఎలా శాంతింపజేయాలో అతనికి అర్ధం కాలేదు. ”సుప్రియా… నువ్వు మతి ఉండే మాట్లాడుతున్నావా…? అసలు జరిగిందేమిటో చెప్పు…!” కాస్త ధైర్యం చేసి అన్నాడతను…

సుప్రియ ఏడుస్తూనే వాణి చెప్పిందంతా అతనికి చెప్పింది…

ఆమె చెప్పింది వినగానే అతని కాళ్ళ క్రింద భూమి కదిలినట్లయ్యింది. ”ఆరోజు ఏం జరిగిందంటే…!” అని మొదలు పెట్టి, వాణితో తను గొడవ పడిన విషయం… తను వాణికి వారం రోజులు గడువివ్వడం… ఈ వారం రోజుల్లోగా తన పైన అపనింద వేసి దాన్ని అందరూ నమ్మే విధంగా చేస్తానని చెప్పడం అంతా వివరంగా చెప్పాడు సుప్రియకి మోహన్…

అతను చెప్పిన విషయాన్ని నమ్మలేక వాణి వంక చూసింది సుప్రియ. వాణి కడుపు చేత్తో పట్టుకుని మరీ నవ్వడం చూసి ఒళ్ళు మండింది సుప్రియకి

”అమ్మా తల్లీ, చేసిందంతా చేసి ఇప్పుడు హాయిగా నవ్వుకుంటున్నావా…? నీతో బెట్ కట్టడం నిజంగా నాది బుద్ది తక్కువ. నేనె ఓడి పోయానని ఒప్పుకుంటున్నాను. నా కాపురం కూలిపోకముందే… నువ్వు చెప్పిందంతా అబద్ధమని చెప్పు…” అభ్యర్ధనగా అన్నాడు మోహన్.

వాణి నవ్వడం ఆపి సీరియస్ గా ”నేనెందుకు చెబుతాను…?” అంది వారిద్దరినీ చూస్తూ…

ఆ మాటలకి ఇద్దరికీ కోపం వచ్చింది… కోపంతో వాళ్ళు ఏదో అనబోయెంతలొ ”ఒక్కసారి అటు వైపు చూడండి…” అంటూ గోడని చూపించింది వాణి.

వారిద్దరూ వాణి చూపించిన వైపుకి చూసారు… అక్కడ కనిపించిన దాన్ని చూసి బిక్క మొహాలేసుకున్నారు ఇద్దరూ…

వాణి మళ్ళీ నవ్వుతూనే ఉంది… ఆ రోజు తేదీ ఏప్రిల్ ఫస్టణి అర్ధం కాగానే తామిద్దరినీ వాణి ఎంత ఘోరంగా ఫూల్స్ ని చేసింది తెలుసుకుని ”యూ” అంటూ ఆమెని పట్టుకోవడానికి ముందుకి కదిలారు తేలికపడ్డ మనసులతో మోహన్… సుప్రియ….

వారికి దొరకకుండా పెద్దగా నవ్వుతూ హాలు చుట్టూ పరుగులు తీడం ప్రారంభించింది వాణి.

మరిన్ని కథలు 

W3Schools

Add a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!